రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ ప్రారంభం

Jan 05 2021 08:32 PM

రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ చేపట్టింది. రామతీర్ధం బోడుకొండను సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఘటన జరిగిన విధానం చూస్తుంటే ఎవరో కావాలనే చేసినట్టు ఉందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వంపై కక్షతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

రాముడి విగ్రహం ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన రంపం దొరికిందని, అనేక ఆధారాలు సేకరించామని వెల్లడించారు. ఆలయంలో ఉన్న ఆభరణాలు గాని, వస్తువులు గాని దొంగతనం జరగలేదని,  రాజకీయాలు చేయడానికే ఘటనకు పాల్పడ్డారన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని దోషులను త్వరలోనే పట్టుకుంటామని సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌ తెలిపారు

ఇది కూడా చదవండి:

'మీర్జాపూర్ 2' యొక్క అద్భుతమైన విజయం తరువాత, అలీ ఫజల్ తన నటన రుసుమును పెంచుతాడు

పుట్టినరోజు షేరింగ్ ఫోటోకు తీపి క్యాప్షన్‌తో దీపికకు అలియా శుభాకాంక్షలు

బాండ్ అమ్మాయి తాన్య రాబర్ట్స్ సజీవంగా ఉన్నారా? షాకింగ్ ద్యోతకం తెలుసు

Related News