జేఎన్‌టీయూ అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.శ్రీనివాస్‌కుమార్‌పై ఓ ఉద్యోగి బెదిరింపులు

Jan 09 2021 11:33 AM

జేఎన్‌టీయూ అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.శ్రీనివాస్‌కుమార్‌పై ఓ ఉద్యోగి బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను మాజీ వీసీ శ్రీనివాస్‌కుమార్‌  వెల్లడించారు. జేఎన్‌టూయూ అనంతపురం సూపరింటెండెంట్‌ ఎం.డీ నాగభూషణం తనను వాట్సాప్‌ మేసేజ్‌ల ద్వారా బెదిరిస్తున్నారని చెప్పారు. ‘మీ జాతకంలో ఏమైనా గండాలు ఉన్నాయా? ఉంటే చూసుకోండి  నీకు  నాకు వ్యక్తిగత కక్షలు లేవు.. మరి ఎందుకు నన్ను బదిలీ చేశారు? నేను అక్కడికి రావాలా వద్దా ? ఆన్సర్‌ చెప్పండి సార్‌ మౌనంగా ఉంటే ఎలా? నిన్ను ఎలా నిద్రపోనిస్తాను?' అంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

జేఎన్‌టీయూ అనంతపురం నుంచి ఇటీవల సూపరింటెండెంట్‌ నాగభూషణంను కలికిరికి బదిలీ చేశారన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం నుంచి కలికిరి బదిలీకి తానే కారణమన్నట్లు తనను బెదిరిస్తున్నారని చెప్పారు. అతని బదిలీ జరిగిన కొద్ది రోజులకే అంటే గతేడాది డిసెంబర్‌ 8న వీసీ పదవీ విరమణ పొందానన్నారు. వీసీ పదవిలో లేననే ఉద్దేశంతో సదరు సూపరింటెండెంట్‌ వార్నింగ్‌లు ఇస్తున్నాడన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతుంటే ఉన్న ఉద్యోగం చేసుకోలేక మాజీ అధికారికి సూపరింటెండెంట్‌ వార్నింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది

ఇది కూడా చదవండి:

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేల ధ్వజం

ఇండ్ Vs ఆస్: భారతదేశం యొక్క మొదటి ఇన్నింగ్స్ 244 వద్ద, ఆస్ట్రేలియా 94 పరుగుల ఆధిక్యంలో ఉంది

'శ్రద్ధ వహించకూడదు' అని బీఎంసీ నోటీసులో సోను సూద్ చెప్పారు

Related News