మత సామరస్యాన్ని దెబ్బ తీస్తూ విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చర్యలను నిరసిస్తూ పలువురు క్రైస్తవ మైనార్టీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. క్రైస్తవులను అవమానిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయటానికి నిరసనగా 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు యలమంచిలి ప్రవీణ్ నేతృత్వంలో మంగళవారం విజయవాడలో సమావేశమైన 13 జిల్లాల నాయకులు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అనంతరం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ మతం గురించి చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయన్నారు.
పాస్టర్లకి రూ.5 వేలు ఎవరు ఇమ్మన్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారని, అదే విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని మరిచారా? అని ప్రవీణ్ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుతారని ప్రశ్నించిన చంద్రబాబు గతంలో చర్చికి వచ్చి గంటన్నర ఎలా ప్రార్థన చేశారు? బైబిల్ ఎలా చదివారు? అని నిలదీశారు.

ఇది కూడా చదవండి:
వాట్సాప్ స్పష్టం చేస్తుంది: క్రొత్త నిబంధనలు మరియు విధానం డేటాను ఎలా సేకరిస్తుంది మరియు ఉపయోగిస్తుందనే దానిపై పారదర్శకతను అందిస్తుంది
సుబ్రత్ సహూ ఛత్తీస్గఢ్ ఇన్‌ఛార్జి అవుతారు
తేజ్ ప్రతాప్ 2021 లో బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు