నగరం లో అంతటా ఆగిన మెట్రో రైళ్లు

Jan 27 2021 12:53 PM

 హైదరాబాద్‌: నగరంలోని  మెట్రో రైలు ను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలుసార్లు మెట్రో రైళ్లు అర్ధాంతరంగా నిలిచిపోగా తాజాగా మరోసారి ముందుకు కదలకుండా మొరాయించాయి. మంగళవారం నాగోల్‌ స్టేషన్‌ డేటా కంట్రోల్‌ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అన్ని మెట్రో రూట్లలో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మియాపూర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వైపు వెళ్తున్న రైలులోనూ సాంకేతిక లోపం తలెత్తగా గాంధీభవన్‌ స్టేషన్‌లో మెట్రో నిలిచిపోయింది. మరోవైపు ముసారాంబాగ్‌లోనూ గడిచిన 15 నిమిషాలుగా మెట్రో సేవలు ఆగిపోయాయి.

వీలైనంత త్వరగా రైళ్లను పునరుద్ధరించేందు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 21న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-5 వద్ద మెట్రో రైలు 15 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్‌ లోపాలు, సాంకేతిక సమస్యలు తరచూ మెట్రో రైల్‌కు బ్రేకులు వేస్తున్నాయి. 

 ఇది కూడా చదవండి:

రైతుల హింసాత్మక నిరసనలపై హిమాన్షి ఖురానా యొక్క దిగ్భ్రాంతికరమైన ప్రకటన

షెహనాజ్ తన ప్రత్యేక రోజును సిద్ధార్ధ్ మరియు అతని కుటుంబంతో సెలబ్రేట్ చేసుకున్నారు , వీడియో చూడండి

సిద్దార్థ్ తన ప్రత్యేక రోజున షెహ్నాజ్ గిల్‌ను కొలనులోకి విసిరాడు

Related News