సఖి సెంటర్ లో చోటు చేసుకున్న విషాదం

Dec 29 2020 08:34 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను వారి కుటుంబాలు కాదు పొమ్మనడంతో.. ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రం సఖి సెంటర్‌లో చోటు చేసుకుంది. జనగామ సీఐ మల్లేశ్‌ కథనం ప్రకారం.. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన నర్సయ్య కూతురు శ్రీలేఖ(20), అదే గ్రామానికి చెందిన దేశబోయిన మనోహర్‌ (20) ప్రేమించుకున్నారు.

ఈనెల 16న ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఈ నెల 22న శ్రీలేఖ, మనోహర్‌ ప్రేమ వివాహం చేసుకుని, రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇరువురి కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా కొత్త జంటను తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలేఖను రక్షణ కోసం జనగామలోని సఖి సెంటర్‌కు పంపించారు. సఖి సెంటర్‌లో మానసిక వేదనకు గురైన శ్రీలేఖ టాయిలెట్‌ డోర్‌కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  

ఇది కూడా చదవండి:

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతులను మోసం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.

చీఫ్ ఇంజనీర్ల కొత్త కార్యాలయ భవనాల కోసం తెలంగాణ ప్రభుత్వం 320 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

'రాయతు బంధు' పథకం కింద రూ .7,300 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

Related News