నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు

Jan 09 2021 09:25 PM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీపైనా ఆంక్షలు విధించారు.

అయితే ఇప్పటికే అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. సంక్షేమ పథకాలపై గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్నా, బడ్జెట్‌ కేటాయింపులు చేసినా పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందంటూ ఎస్‌ఈసీ వాటిని ప్రజలకు అందించడం ఆపేయాలంటూ సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల్లో స్పష్టంగా రాజకీయ అజెండా కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు

ఇది కూడా చదవండి:

కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదు..ఏపీ పోలీసు అధికారుల సంఘం తెలియజేసింది

చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్‌ను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

44,08,921 మందికి అమ్మ ఒడి వర్తింపు,విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలియజేసారు

Related News