మైనర్‌ బాలికపై లైంగిక దాడి,నిందితుడిని విడిపించేందుకు..టీడీపీ నాయకుల రాజీ ప్రయత్నాలు!

Feb 02 2021 11:56 AM

భవానీపురం: విద్యాధరపురం లేబర్‌ కాలనీలో ఒక మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని దిశ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న బాధితురాలి వైద్య పరీక్షల నివేదికను బట్టి సోమవారం రిమాండ్‌కు పంపించనున్నట్లు తెలిసింది. స్థానికుల కథనం మేరకు బాలిక ఇంట్లో కేబుల్‌ రాకపోవడంతో స్థానికంగా కేబుల్‌ ఆపరేటర్‌గా ఉంటున్న నిందితుడు ఎస్‌కే అయాజ్‌ ఇంటికి శనివారం వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అయాజ్‌ ఈ దురాగతానికి పాల్పడ్డాడు.

బయటకు వెళ్లిన కుమార్తె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లి వెతుకులాట మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న నిందితుడు బాలికను తన ఇంటి భవనం నుంచి రెండు భవనాలపై నుంచి తీసుకువెళ్లి మూడో ఇంటి భవనంలో దించాడు. అది చూసిన ఎదురింటివారు బాలిక తల్లికి చెప్పారు. గబగబా వచ్చిన ఆమె కుమార్తె పరిస్థితి చూసి గాబరాపడి ఇంటికి తీసుకువెళ్లి ఏం జరిగిందని అడిగి తెలుసుకోవడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నాయని, అందులో అత్యాచారం కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే బాధితులతో రాజీ చేసుకుని మహిళా సెషన్స్‌ కోర్టులో నాలుగు కేసులు కొట్టేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు పశి్చమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు కావడం, బాధితురాలి మేనమామ టీడీపీ నాయకుడు కావడంతో టీడీపీ వర్గాలు రాజీ చేసేందుకు ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది.  

ఇది కూడా చదవండి :

పట్టణాల్లో ‘ఇంటింటికీ రేషన్‌’ కోలాహలం

మహారాష్ట్రలో 119 పక్షులు చనిపోయినట్లు, నమూనాలను పరీక్షల కోసం పంపారు

సెంట్రల్ 'పెట్రోల్'పై స్వామి దాడి రావణుడి లంకలో 51 రూపాయలు ఖర్చవుతుంది ..' 'అన్నారు

Related News