ఆలయాల్లో దాడులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం శనివారం తొలిసారిగా భేటీ అయ్యింది

Jan 09 2021 10:01 PM

ఆలయాల్లో దాడులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం శనివారం తొలిసారిగా భేటీ అయ్యింది. సిట్ అధికారి అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఆలయాల్లో దాడులపై విచారణకు జిల్లాల్లో దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. 2020 సెప్టెంబర్ నుంచి ఆలయాల్లో జరిగిన 23 ఘటనలపై సిట్‌ బృందం విచారణ చేయనుంది. వచ్చే వారం రెండో సారి సిట్ బృందం సమావేశం కానుంది

రాష్ట్రంలో ఆలయాలపై దాడుల ఘటనలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసిన సంగతి విధితమే. ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఐపీఎస్‌ అధికారి జీవీజీ అశోక్‌కుమార్‌ సిట్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. సిట్‌ బృందంలో మరో 15 మంది సభ్యులుంటారు

ఇది కూడా చదవండి:

నిందితులను కలిసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు

కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదు..ఏపీ పోలీసు అధికారుల సంఘం తెలియజేసింది

Related News