గత ఏడాదిన్నరలో పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది నియామకాలు

Feb 13 2021 02:27 PM

అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో ఇప్పటివరకు 52,341 మంది వైద్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 34,546 మంది ఎంబీబీఎస్‌ వైద్యులు కాగా 17,795 మంది స్పెషలిస్టులున్నారు. గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 7,491  మంది వైద్యుల పేర్లు నమోదయ్యాయి. విశాఖ, కృష్ణా జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లా నుంచి 1,172 మంది పేర్లు నమోదయ్యాయి. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారిలో 12.67 % మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 1,550 మంది వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టింది. వీరిలో స్పెషలిస్టు వైద్యులే 695 మంది ఉన్నారు. మరో 700 మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లున్నారు. మిగతా వారు డిప్లొమాతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి:

అభినవ్ శుక్లా మాట్లాడుతూ బిబి 14 తర్వాత భార్య రుబినా దిలైక్‌తో అంతా బాగానే ఉంది

అనుపమ: పరాస్ కల్నావత్ ఏక్ సమ్మర్ కోవిడ్ -12 పాజిటివ్ పరీక్షించారు

సుర్భి చందన గాటా వర్క్ చీరలో చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది.

 

Related News