నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేల ధ్వజం

Jan 09 2021 11:24 AM

ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు.

‘కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్‌ వెనక కుట్ర కోణం ఉంది’’ అని మంత్రి కన్నబాబు అన్నారు.

ఇక నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వడమేంటి. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం’’ అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ రమేష్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు.  వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా’’ అని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి:

ఇండ్ Vs ఆస్: భారతదేశం యొక్క మొదటి ఇన్నింగ్స్ 244 వద్ద, ఆస్ట్రేలియా 94 పరుగుల ఆధిక్యంలో ఉంది

'శ్రద్ధ వహించకూడదు' అని బీఎంసీ నోటీసులో సోను సూద్ చెప్పారు

మిమి చక్రవర్తి నుండి అబిత్ ఛటర్జీ వరకు చాలా మంది సెలబ్రిటీలు నుస్రత్ జహాన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Related News