నకిలీ టీఆర్పీ కుంభకోణం: ఛార్జీషీట్ దాఖలు చేసిన ముంబై పోలీసులు

టెలివిజన్ రేటింగ్ పాయింట్ల (టీఆర్పీ) రిగ్గింగ్ కుంభకోణంలో ముంబై పోలీసులు మంగళవారం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్న పోలీసు క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జీషీటును దాఖలు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ సహా 12 మందిని క్రైం బ్రాంచ్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని టెలివిజన్ ఛానళ్లు టీఆర్పీ నెంబర్లను రిగ్గింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తూ, హాన్సా రీసెర్చ్ గ్రూప్ ద్వారా రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఫిర్యాదు చేయడంతో గత నెలలో ఈ నకిలీ టీఆర్పీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హాన్సా బారోమీటర్లను ఇన్ స్టాల్ చేసే బాధ్యతలు తీసుకున్నారు, ఇది నమూనా గృహాల వద్ద వ్యూయర్ షిప్ డేటాను రికార్డ్ చేస్తుంది.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -