డబ్బు అవసరమంటూ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో పోస్టింగ్‌లు

ఆధునిక యుగంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌లు ఓపెన్‌ చేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు యువత ఇంటర్నెట్‌ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాను విరివిరిగా వినియోగిస్తున్నారు. ఎటువంటి సమాచారమైనా క్షణాల్లో పోస్టింగ్‌ చేయడం షేర్‌ చేయడం అలవాటుగా మారింది. దీంతో ఉపయోగం ఎంత ఉందోకానీ కొందరికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ప్రొఫైల్‌ ఫొటోను కొందరు డౌన్‌లోడ్‌ చేసుకుని ఫేక్‌ అకౌంట్‌ను అదే పేరుమీద ఓపెన్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఓన్‌ హెల్ప్‌ మీ.అంటూ చాటింగ్‌ చేస్తారు

ఫేస్‌బుక్‌ స్నేహితులు స్పందించినప్పుడు అర్జెంట్‌గా అమౌంట్‌ కావాలని, గూగూల్‌ పే, ఫోన్‌ పే, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌. ఇలా ఏదీ కావాలంటే అది ఇస్తారు. ఆపదలో ఉన్నారు అత్యవసరంగా డబ్బు అవసరమై ఉంటుందని భావించిన స్నేహితులు రూ.20 వేలు, రూ.10 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. మొదట్లో పెద్ద మొత్తంలో మనీ అవసరమంటూ చాటింగ్‌ చేస్తూ చివరకు ఎంతో కొంత అత్యవసరంగా కావాలంటూ అడుగుతున్నారు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -