అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి వ్యక్తిగత స్పర్థలు లేవు: సజ్జల

అమరావతి: ‘అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే. విభేదాలు ఎంతమాత్రం కాదు’అని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణలో పార్టీ విస్తరణను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  కోరుకోవడం లేదని తెలిపారు. అయితే అక్కడి అభిమానుల కోసం పార్టీ పెట్టాలన్నది షర్మిల మనోభీష్టమని విశ్లేషించారు. వారి మధ్య వేర్వేరు వాదనలున్నా అవి వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపబోవన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మంగళవారం మాట్లాడారు. ఆ వివరాలివీ.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ వైఎస్సార్‌ సీపీ విస్తరణ కోసం ఒత్తిడి వచ్చింది. కానీ దీనివల్ల రాష్ట్రానికి నష్టమని వైఎస్‌ జగన్‌ భావించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణాలో వైఎస్సార్‌సీపీ విస్తరణకు విముఖత వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేవి, పరిష్కరించుకునే అంశాలున్నాయని జగన్‌ చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తే ప్రతి దాన్నీ రాజకీయ కోణంలోనే చూసే వీలుందని, పార్టీ విస్తరణ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుందని, అందువల్ల వద్దని జగన్‌ స్థిరమైన అభిప్రాయం వెలిబుచ్చారు. తెలంగాణలో పార్టీ విస్తరణ ఆలోచన ఇప్పట్లో వైఎస్సార్‌ సీపీకి లేదు. ఈ విషయంలో జగన్‌ ఆలోచనల్లో ఇప్పటికైతే మార్పు లేదు.

ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే తెలంగాణలోనూ వైఎస్‌ఆర్‌ అభిమానులున్నారని, అక్కడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని షర్మిల అనుకుంటున్నారేమో! అందుకే పార్టీ ఆలోచన వచ్చి ఉండొచ్చు. పార్టీ స్థాపిస్తే వచ్చే కష్టనష్టాలు, లాభనష్టాలు, ఆటుపోట్లు చూసిన వ్యక్తిగా సాదక బాధకాల గురించి జగన్‌ చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తెగా షర్మిల గుర్తింపు పొందిన మహిళ. ఆమెకు భిన్నాభిప్రాయాలున్నాయి. అందుకే తన ఆలోచనతో ముందుకెళ్తున్నారు.

సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టడం వల్లే మునుపెన్నడూ లేనంత ఎక్కువగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలయ్యాయి. ఇది తెలిసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ఏదో జరుగుతున్నట్లుగా చిత్రీకరించే యత్నం చేశారు. రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరించిన నిమ్మగడ్డ తీరును చూసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు అవసరమని భావిస్తున్నాం. కమిషన్‌లో మల్టీ మెంబర్‌ విధానం ఉండాలనే దిశగా అడుగులేస్తున్నాం. దీనిపై జాతీయ స్థాయిలో చర్చిస్తాం.

ఇది కూడా చదవండి:

భారత ఔషధ సంస్థ 50 మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించాలి, అవకతవకలకు యూ ఎస్ లో జప్తు చేయబడింది

చైనా ల్యాబ్ ల నుంచి కరోనావైరస్ లీక్ అయ్యే అవకాశం లేదని డబ్టీమ్ టీమ్ చెబుతోంది.

యుఎఇ చరిత్ర చేస్తుంది, వ్యోమనౌక విజయవంతంగా మార్స్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది "ఎడ్ "

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -