ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 51,420 కరోనా పరీక్షలు నిర్వహించగా, 377 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 883587కి చేరింది. కరోనా బారినపడి సోమవారం చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, ఇప్పటివరకు 7122 మంది మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది
గడచిన 24 గంటల్లో 278 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 8,73,427 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. నేటివరకు రాష్ట్రంలో 1,20,53,914 శాంపిల్స్‌ను పరీక్షించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,038 యాక్టివ్ కేసులు ఉన్నాయి
ఇది కూడా చదవండి:
'మీర్జాపూర్ 2' యొక్క అద్భుతమైన విజయం తరువాత, అలీ ఫజల్ తన నటన రుసుమును పెంచుతాడు
పుట్టినరోజు షేరింగ్ ఫోటోకు తీపి క్యాప్షన్‌తో దీపికకు అలియా శుభాకాంక్షలు
బాండ్ అమ్మాయి తాన్య రాబర్ట్స్ సజీవంగా ఉన్నారా? షాకింగ్ ద్యోతకం తెలుసు