ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అదిత్యానాథ్ దాస్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా అదిత్యానాథ్ దాస్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్‌ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్‌ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులంతా పనిచేస్తామని సీఎస్‌ ఆదిత్యనాథ​ దాస్‌ తెలిపారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ చీఫ్ సెక్రటరీ అదిత్యానాథ్ దాస్‌, పదవీ విరమణ చేసిన మాజీ సీఎస్‌ నీలం సాహ్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయిన సంగతి తెలిసిందే. 
 

 ఇది కూడా చదవండి :

ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్‌బీకేలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, అమూల్‌ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు

న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైనందున 2021 లో న్యూజిలాండ్ మారు మోగింది

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరెన్ బేడి, సిఎం వి నారాయణసామి ప్రజలను పలకరించారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -