గౌహతి: రాష్ట్ర పోలీసు పరీక్ష పేపర్ లీక్ కుంభకోణంలో 36 మంది ప్రమేయం ఉందని ఆరోపిస్తూ అస్సాం పోలీసులు ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. 2621 పేజీల ఈ చార్జిషీట్ లో మాజీ కరీంగంజ్ ఎస్పీ కుమార్ సంజిత్ కృష్ణ, బహిష్కృత బీజేపీ నేత దిబోన్ దేకా, రిటైర్డ్ డీఐజీ పి.కె.దత్తా పేర్లు ఉన్నాయి.
ఈ కేసులో మొదటి అరెస్టు అయిన 87 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయడం జరిగిందని సీఐడీ ఐజిపి సురేంద్ర కుమార్ మీడియా ముందు తెలిపారు. 1,217 పేజీల కేసు డైరీకూడా దాఖలు చేశామని, 183 మంది వ్యక్తుల పేర్లను ప్రాసిక్యూషన్ సాక్షులుగా పేర్కొన్నామని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు అరెస్ట్ చేసిన వ్యక్తుల యొక్క కన్ఫెషనల్ స్టేట్ మెంట్ లను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నమోదు చేశారు.