మూడు రాజధానులకు మద్దతుగా 115వ రోజుకు చేరిన దీక్షలు

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న తరుణంలో పేదల ప్రాణాలను పణంగా పెట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ మొండిగా ముందుకెళితే రాష్ట్రంలోని 3.50 కోట్ల మంది బహుజనులు ఎన్నికలను బహిష్కరించేలా చేస్తామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 115వ రోజుకు చేరాయి.

పలువురు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ పేరుతోదళిత, బహుజనులైన ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్, నలుగురు డీఎస్పీలు, ముగ్గురు సీఐ స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించటం అమానుషమన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉండరనే అనుమానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను ఎన్నికల కోడ్‌ పేరుతో తొలగించారన్నారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు బి.శామ్యూల్, నత్తా యోనారాజు, మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, పల్లె బాబు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:

కంచికచర్ల వద్ద పట్టుబడ్డ రూ.50 లక్షలపై పోలీసుల ఆరా

వార్తల కంటెంట్ కోసం చెల్లించాల్సి వస్తే ఆస్ట్రేలియాలోని సెర్చ్ ఇంజిన్‌ను తీసివేయమని గూగుల్ బెదిరించింది "

తెలంగాణ పోలీసుల సహాయంతో భావోద్వేగం, మహిళా నాయకురాలు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -