బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు ఒకత్తైతే అందరికీ వండి పెట్టడమనేది మరో ఎత్తు. మొదటి విషయాన్ని పక్కన పెడితే బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి వారం నుంచి కంటెస్టెంట్లందరి కోసం వంట చేస్తూ వస్తోంది లాస్య. ఏమాత్రం విసుక్కోకుండా అడిగిన వారికి అన్నీ చేసి పెట్టేది. కానీ ఇదే వంట వల్ల ఓసారి నామినేషన్‌లోకీ వచ్చింది. ఆమె చేసిన పప్పు వల్ల ఇంటిసభ్యులు అనారోగ్యానికి గురయ్యారంటూ దివి లాస్యను నామినేట్ చేసింది. అది ఫ్రిజ్‌లో పెట్టిన పప్పు వల్ల కానీ తను వండటం వల్ల కాదని లాస్య తిప్పికొడుతూ ఏడ్చేసింది. ఆ సమయంలో గంగవ్వ కూడా లాస్యను వెనకేసుకొచ్చింది. ఇలా మాటలు పడ్డా కూడా అందరి కడుపు నింపేందుకు మళ్లీ వంటింట్లోనే దూరిన ఆమెకు నెటిజన్లు వంటలక్క అని పేరు కూడా పెట్టేశారు. కానీ ఏం లాభం ఈ వారం ఆమె ఎలిమినేట్ అయిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఇదిలా వుంటే స్టార్ మా 'హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరు?' అంటూ లేని ఆసక్తిని కల్పించడానికి ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో అందరూ సంతోషంగా డ్యాన్సులు చేస్తున్న సమయంలో 'రోజురోజుకీ పోటీ పెరిగిపోతోంది.. రోజురోజుకీ హౌస్‌మేట్స్ తగ్గిపోతున్నారు' అంటూ నాగార్జున ఎలిమినేషన్ గురించి ప్రస్తావించారు. దీంతో కంటెస్టెంట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఎలిమినేట్ అయింది ఎవరో మాకు తెలుసుగా అంటున్నారు. ఎలిమినేట్ అవుతానని తెలీని మా వంటలక్క లాస్య ఆనందంతో షోలో చివరి సారిగా డ్యాన్స్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు
కాగా ఈ వారం అభిజిత్, సోహైల్, హారిక, మోనాల్, అరియానా, లాస్య నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో మోనాల్ పక్కాగా ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్ అఖిల్‌ను కాదని హారికకు సపోర్ట్ చేసింది. తనపై నమ్మకం ఉంచినందుకు హారికను కెప్టెన్ చేసింది. అఖిల్‌ను ఎత్తుకుని సోహైల్, అభిజిత్‌ను ఎత్తుకుని అవినాష్ ఎక్కువ సేపు నిలబడలేకపోగా మోనాల్ మాత్రం ధైర్యంగా చిరునవ్వుతో నా మీద నమ్మకం ఉంచు అంటూ హారికను భుజాన మోసి కడవరకు నిలబడింది. ఏడు సార్లు కెప్టెన్సీకి పోటీ చేసి ఓడిన హారికకు విజయాన్ని సొంతం చేసింది. దీంతో మోనాల్ బలమేంటో అందరికీ తెలిసొచ్చింది. తలుచుకుంటే తనూ ఆడగలదని నిరూపించింది. ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే ఆమె ఎక్కువ ఓట్లు పడ్డాయట. దీంతో ఆఖరి నిమిషంలో లాస్యను కిందకు లాగి ఆమె పై స్థానానికి వెళ్లిపోయింది. ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగలిగింది.
ఇది కూడా చదవండి:
ఇండియన్ అమెరికన్ మాల అదిగా కొత్తగా ఇన్ కమింగ్ ఫస్ట్ లేడీ కి పాలసీ డైరెక్టర్ గా నియమితులయ్యారు.
డ్రగ్స్ కేస్ : కోర్టు భారతి సింగ్, భర్త హర్షలను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
రూ.250 కంటే తక్కువ కే రోజుకు 3జీబీ డేటాను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్, దాని వాలిడిటీ తెలుసుకోండి.