ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 51,207కరోనా పరీక్షలు నిర్వహించగా, 289 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 883876కి చేరింది. కరోనా బారినపడి మంగళవారం ప్రకాశం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, ఇప్పటివరకు 7125 మంది మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో 428 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 8,73,855 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. నేటివరకు రాష్ట్రంలో 1,21,05,121 శాంపిల్స్‌ను పరీక్షించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,896 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇది కూడా చదవండి:
నిరసనల మధ్య బిడెన్ విజయాన్ని ధృవీకరించడానికి యుఎస్ కాంగ్రెస్
ప్రభుత్వ ఏజెన్సీ హ్యాకింగ్ వెనుక రష్యా అవకాశం ఉందని యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నివేదించాయి
'కోవిన్' యాప్ డౌన్‌లోడ్ చేయకుండా ప్రజలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తుంది