రాష్ట్రంలో కోవిడ్‌–19 రికవరీ రేటు దేశంలోనే అత్యధికం

అమరావతి: కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షల సామర్ధ్యంతో పాటు కరోనా సోకి రికవరీ అయిన వారి శాతంలో దేశంలోనే రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే. రాష్ట్రంలో కోవిడ్‌–19 లక్షణాలున్న వారిని జల్లెడ పట్టే కార్యక్రమాన్ని తొలి నుంచీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌–19 నివారణ చర్యల విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని తరచూ సమీక్షిస్తూ తగిన ఆదేశాలు, సూచనలు జారీ చేయడం తెలిసిందే.

ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాటు క్షేత్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక అమలయ్యేలా చూశారు. దీంతో ప్రతీ నెలా రికవరీ రేటు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రికవరీ రేటు  రాష్ట్రంలో నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో రికవరీ రేటు 1.33 శాతం ఉండగా, ఈ ఏడాది జనవరి 25వ తేదీ నాటికి అది 99.04 శాతానికి చేరింది. ఆంధ్రప్రదేశ్‌ కంటే జనాభాలో, మౌలిక వసతుల్లో బాగా అభివృద్ధి చెందిన పెద్ద రాష్ట్రాలే టెస్టుల సామర్థ్యం, రికవరీలో వెనుకపడగా, ఏపీ దూసుకెళుతోంది. ఈ నెల 25వ తేదీ నాటికి  మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తదితర రాష్ట్రాలు ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి. 

ఇది కూడా చదవండి:

స్వతంత్ర భారతదేశపు మొదటి ఉగ్రవాది నాథురామ్ గాడ్సే: ఒవైసీ "

యుఎఇ కొత్త చట్టం విశిష్ట నిపుణులకు పౌరసత్వాన్ని అనుమతిస్తుంది

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ గ్రాండ్ అలయన్స్‌లో చేరాలని లూరిన్ జ్యోతి గొగోయ్, అఖిల్ గోగోయ్ కోరారు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -