కట్టలు తెంచుకున్న కృష్ణమ్మ ,భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులలో వరద ఉదృతి

భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. అధిక వర్షాలతో రాష్ట్రంలోని  ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పలు ప్రాజెక్ట్‌లకు ఇన్‌ఫ్లో అత్యధికంగా వచ్చి చేరుతోంది. అటు వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద  రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అలాగే సుంకేశుల వద్ద  ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 61,240క్యూసెక్కులుగా, శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,91,416, ఔట్ ఫ్లో 4,11,885 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,69,866 క్యూసెక్కులు... పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,47,418 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,49,807 క్యూసెక్కలుగా కొనసాగుతోంది. వంశధార నదికి వరద నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద  మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 55,540 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  56,750 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయని.. జాగ్రత్తగా ఉండాలని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు.

కట్టలేరు, పాలేరు, వైరా, మున్నేరు ఒక్కటై ముంచేస్తున్నాయి. కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు మళ్లీ కట్టుబట్టలతో కరకట్టమీదకు చేరారు. అటునుంచటే పునరావాస కేంద్రాలకు తరలుతున్నారు. విజయవాడలోని రణదీవెనగర్‌, తారకరామనగర్‌, కృష్ణలంక ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించింది.

ఇది కూడా చదవండి :

ఆయుర్వేద చికిత్స సమయంలో మహిళలను లైంగికంగా వేధించిన కేసులో కేరళలోని ఓ పూజారి అరెస్ట్

కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద పై ఆరోపణలు చేసిన లా స్టూడెంట్

నేడు రెడ్ మార్క్ లో షేర్ మార్కెట్, సెన్సెక్స్ పతనం

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -