షెడ్యూల్‌ ప్రకటించిన ఇంటర్‌ బోర్డు,మార్చి 31 నుంచి ప్రాక్టికల్స్‌

అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు 2021 మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతేడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనందున అప్పుడు ఫస్టియర్‌ పరీక్షలు రాసిన వారు ఈ పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. 

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఆదివారాలు సహా ఏప్రిల్‌ 24 వరకు జరుగుతాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో.. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు జరుగుతాయి.

ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వేల్యూస్‌ పరీక్ష మార్చి 24న, ఎన్విరాన్మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.  

ఇది కూడా చదవండి:

అంతుచూస్తామంటూ పాకాల తహసీల్దారుకు టీడీపీ నేత బెదిరింపులు

వెంటనే ఆయనపై సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవాలి ఆర్టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబు అన్నారు

శాంతిని విచ్ఛిన్నం చేసినందుకు యుపి పోలీసులు చనిపోయిన వ్యక్తికి నోటీసు పంపారు, 'జరిమానాతో కోర్టుకు రండి అన్నారు

 

 

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -