తీరనున్న బెజవాడ ప్రజల కష్టాలు , కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం

భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్‌లైఓవర్‌ మీదుగా వాహనాల రాకపోకలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ లాంఛనంగా  ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్‌లైఓవర్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ అత్యంత సాంకేతిక విలువలతో రూ.501 కోట్లతో నిర్మించిన కనకదుర్గ ఫ్‌లైఓవర్‌ విజయవాడ నగరానికి మకుటంలా నిలుస్తుందన్నారు. 

రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096కిలోమీటర్లు. 


 దుర్గ గుడి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2.6 కి.మీ  పొడవుతో  వంపులు తిరుగుతూ ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్‌ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.   

ఇది కూడా చదవండి:

సుశాంత్ మృతి తో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ, మెడికల్ రిపోర్టులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

పేదరికం కారణంగా కొత్తగా పుట్టిన వారు రూ. 4000కు విక్రయించారు.

మొబైల్ ఫీవర్ క్లినిక్ మరియు స్త్రీ టాయిలెట్ కొరకు సి ఎస్ ఆర్ అవార్డు పొందిన కే ఎస్ ఆర్టీసీ

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -