కళల మహారాణికి కన్నీటి వీడ్కోలు

 అనకాపల్లి : ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.శోభానాయుడు అనారోగ్యంతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. విశ్వవ్యాప్తంగా తన నాట్యంతో అభిమానులను సంపాదించుకున్న ఆమె అనకాపల్లిలోనే పుట్టారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన ఆమె తల్లి సరోజనిదేవి, వెంకటనాయుడులకు 1956లో జన్మించారు. శోభానాయుడు కూచిపూడి నృత్యంలో ఎదుగుతారని తల్లి చిన్నప్పుడే గుర్తించారు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతున్నప్పుడు.. శోభానాయుడు కాళ్లు, చేతుల కదలికలను సరోజనిదేవి గమనించారు. అప్పుడే శోభానాయుడికి నృత్యం నేర్పించాలని భావించారు. ఇందుకోసం ఆమె కుటుంబంతో పెద్ద యుద్ధమే చేశారంట. ఇదే విషయాన్ని శోభానాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పేరు హోదా అమ్మ పెట్టిన భిక్షే అంటూ వెల్లడించారు. ఆమె మూడో ఏటన  ఆ కుటుంబం రాజమండ్రికి వెళ్లిపోయింది. అక్కడ నాల్గో ఏట నుంచే శోభానాయుడికి కూచిపూడిలో శిక్షణఇప్పించేందుకుతల్లిదృష్టిసారించారు.

నృత్యంలో ఆమె ఇచ్చిన హావభావాలు, అభినయం చూసి తల్లి.. మరింత బాగా తీర్చిదిద్దాలని చెన్నైలోని చిన వెంపటి సత్యం వద్ద శిక్షణకు పంపించారు. ఆడపిల్లను అంత దూరం పంపించే విషయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సరోజనిదేవి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తన కుమార్తెలోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. తల్లి ఇచ్చిన ప్రేరణే శోభానాయుడిని ఈ స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా 12 ఏళ్లకే ప్రదర్శనివ్వడం ప్రారంభించిన శోభానాయుడు సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో తనదైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె బహుముఖ ప్రతిభకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఎన్నో పురస్కారాలు, వివిధ దేశాల్లో నృత్య ప్రదర్శనల అవకాశాలు దక్కించుకున్న శోభానాయుడు కూచిపూడి కళాప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.


 పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. శోభానాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డ, కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎప్పుడు.. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా హాజరయ్యేవారు.

కళాసమితి చిన్నారులకు ఆమె అమూల్యమైన సందేశం ఇచ్చి స్ఫూర్తి రగిలించేవారు. అంతరించిపోతున్న కళా నృత్యాలను జీవం పోయడానికి ఆమె పడిన కష్టం, చేసినకృషిమరువలేనివి. అనకాపల్లిలో పుట్టిన శోభానాయుడు మృతి కూచిపూడి నృత్యానికి తీరని లోటు. చినవెంపటి సత్యం వద్ద శిక్షణ తీసుకున్న శోభానాయుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. కూచిపూడి ఆర్ట్స్‌ స్కూల్‌ పేరుతో శోభానాయుడు హైదరాబాద్‌లో సంస్థను ప్రారంభించి ఎంతోమందికి శిక్షణ అందించారు.  

ఇది కూడా చదవండి​:

ఆయుర్వేద చికిత్స సమయంలో మహిళలను లైంగికంగా వేధించిన కేసులో కేరళలోని ఓ పూజారి అరెస్ట్

కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద పై ఆరోపణలు చేసిన లా స్టూడెంట్

నేడు రెడ్ మార్క్ లో షేర్ మార్కెట్, సెన్సెక్స్ పతనం

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -