కన్సల్టెన్సీలను ఎంపిక చేయనున్న రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ

అమరావతి: రాష్ట్రంలో ప్రధానంగా చేపట్టే రోడ్డు ప్రాజెక్టులకు సవివర నివేదికల (డీపీఆర్‌) తయారీ బాధ్యతను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు అప్పగించారు. కన్సల్టెన్సీల ఎంపిక మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ (మోర్త్‌ – రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ) నిర్వహించనుంది. సాధారణంగా రాష్ట్రంలో చేపట్టే రహదారి ప్రాజెక్టుకు డీపీఆర్, కన్సల్టెన్సీ బాధ్యతలు రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చూస్తుంది. రోడ్డులో వెళ్లే ట్రాఫిక్‌ వాహనాల సంఖ్య, ప్యాసింజర్‌ కార్‌ యూనిట్ల వివరాలపై నివేదిక రూపొందించి మోర్త్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుంది. అయితే కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన బెంగుళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే, విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే రహదారుల ప్రాజెక్టులతో పాటు అనంతపురం–గుంటూరు రహదారి నిర్మాణానికి డీపీఆర్‌లను ఎన్‌హెచ్‌ఏఐ తయారు చేయనుంది. టెండర్ల ద్వారా కన్సల్టెన్సీలను ఎంపిక చేసి, రహదారుల ప్రాజెక్టులకయ్యే అంచనా వ్యయం, అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు.

రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి శంకర్‌ నారాయణ ఇటీవల.. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినప్పుడు బెంగుళూరు–విజయవాడఎక్స్‌ప్రెస్‌వేఅలైన్‌మెంట్‌నుఖరారుచేయాలనివిన్నవించారు. కొడికొండ చెక్‌పోస్టు, పులివెందుల, ముద్దనూరు, మైదుకూరు మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలని ఆర్‌అండ్‌బీ ప్రతిపాదన సమర్పించింది. అయితే మైదుకూరు నుంచి విజయవాడకు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే (అటవీ ప్రాంతం మీదుగా) నిర్మించాలని ప్రతిపాదించారు. విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే రహదారి ప్రాజెక్టుకు ఏపీఐఐసీ రూ.1,500 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించింది. అయితే ఈ డీపీఆర్‌పై ఎన్‌హెచ్‌ఏఐ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్లు డీపీఆర్‌ తయారు చేయడంతో పాటు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.  అనంతపురం – గుంటూరు రహదారి నిర్మాణం కేంద్రమే చేపట్టనుంది. అనంతపురం, బుగ్గ, కొలిమిగుండ్ల, బనగానపల్లె, గిద్దలూరు, కంభం, వినుకొండ, గుంటూరు వరకు రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌ను రూపొందించనుంది. 

ఇది కూడా చదవండి:

తెలంగాణ, ఇంటర్ పరీక్ష ఫీజుకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయబడింది,

టిఆర్‌ఎస్‌ ఎంపీలు బడ్జెట్‌ సెషన్‌కు ప్రణాళిక రూపొందించారు.

ఆత్మహత్య కేసులో భర్తను నిర్దోషిగా ప్రకటించిన బిహెచ్‌సి 'భార్య నుండి నగదు డిమాండ్ చేయడం వేధింపులు కాదు'అన్నారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -