చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్‌ను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ణయం ప్రజలను విస్మయానికి గురిచేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పరిస్థితులను ఎస్‌ఈసీకి అధికారులు వివరించినా పట్టించుకోలేదని.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌ నిర్ణయం చాలా వివాదాస్పదంగా ఉందని, మొండిగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు

‘గతంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు ప్రభుత్వం సన్నద్ధంగా లేదన్నా షెడ్యూల్‌ ఇచ్చారు. చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్‌ను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారు. ఆయన రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడం లేదు. చంద్రబాబు హయాంలో స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తులా పనిచేస్తున్నారని అర్థమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డ షెడ్యూల్ విడుదల చేశారు.రెండు నెలలు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుంది?. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం తప్ప.. ఎన్నికలకు భయపడం’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

రాబోయే తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీ సాధిస్తుంది. ఆ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ మరింత దిగజారిపోతుందని ఈ విధంగా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉద్యోగులు చాలా మంది ఆందోళనలో ఉన్నారు. ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ అంబటి ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి :

ఆయన మొదటి టీకాను పొందుతారు : ఆరోగ్య మంత్రి ఇటాలా రాజేందర్

భరోసా సెంటర్ ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైంది

కెసిఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బిజెపి ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -