ఓ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన రూ.175 కోట్ల మనీలాండరింగ్ కుంభకోణంలో దర్యాప్తు నిమిత్తం మంగళవారం ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్, కుమారుడు విహాంగ్ లకు సమన్లు జారీ చేసింది.
అంతకుముందు నవంబర్ 24న శివసేన ఎమ్మెల్యే గోవాలో ఉన్నప్పుడు ముంబై, థానేలోని సర్నాయక్ ఇల్లు, కార్యాలయాలతోపాటు ఆయన వ్యాపార సహచరులతో సహా పది చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రైవేట్ సంస్థ, టాప్ సెక్యూరిటీస్ గ్రూప్, ప్రతాప్ సర్నాయక్ ల మధ్య అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఏజెన్సీ కొన్ని రుజువులను రికవరీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.