19 ఏళ్ల హిందూ మహిళను వివాహం చేసుకోవడానికి ముందు హిందూ మతంలోకి మారిన 21 ఏళ్ల ముస్లిం వ్యక్తి, పంజాబ్, హర్యానా హైకోర్టు జోక్యం తో పోలీసు రక్షణలో ఉన్నారు. 'లవ్ జిహాద్'కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ గతవారం చెప్పారు. తన పేరు కూడా మార్చుకున్న 21 ఏళ్ల వ్యక్తి హిందూ ఆచారాల ప్రకారం 19 ఏళ్ల యువతిని నవంబర్ 9న వివాహం చేసుకున్నట్లు యమునానగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమల్ దీప్ గోయల్ మంగళవారం తెలిపారు.
వివాహం అనంతరం దంపతులు తమ ప్రాణాలకు, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, తమ వైవాహిక జీవితానికి భంగం కలిగిందని పేర్కొంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.