అన్నగా తన విజయాన్ని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని, ఆయన నైతిక మద్దతు తనకెప్పుడూ ఉంటుందని, అయితే ఆయన పార్టీలోకి వస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేనని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో శుక్రవారం రాత్రి పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చిరంజీవి గురించి పై వ్యాఖ్యలు చేశారు.
ఈ భేటీ ముఖ్య ఉద్దేశం కాపు సంక్షేమం కోసమేనని పవన్ అన్నారు. కాపుల వెనుకబాటుతనాన్ని బలంగా జనసేన ముందుకు తీసుకెళుతుందన్నారు. కాపుల న్యాయపరమైన సమస్యలపై భవిష్యత్తులో తాను అండగా ఉంటానన్నారు. తుని ఘటనలో పెట్టిన కేసులను ఈ ప్రభుత్వం ఇంకా కొన్ని జిల్లాల్లో ఎత్తివేయలేదని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నారు. కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు హరిరామ జోగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:
'పరశురాముడు గొడ్డు మాంసం లేకుండా ఆహారం తినలేదు ...' అని టిఎంసి నాయకుడు మదన్ మిత్రా అన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రుణ మాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించవచ్చు