పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు

అమరావతి : 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.తుది అంచనా వ్యయంపై కేంద్రం పేచీ నేపథ్యంలో పనుల పూర్తిపై స్తబ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సమక్షంలో వర్చువల్‌ విధానంలో సీఎం సోమశిల రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా  కృష్ణాపురంలో పైలాన్‌ వద్ద మంత్రులు పి.అనిల్‌ కుమార్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికలకు ముందే సోమశిల రెండో దశ పనులు పూర్తి చేస్తామన్నారు.

పల్నాడులో కరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. సంగం, నెల్లూరు బ్యారేజీల పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయని.. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేస్తామన్నారు. వీటితో పాటు రూ.918 కోట్ల వ్యయంతో సోమశిల-కండలేరు డబ్లింగ్‌ వర్క్స్‌ , రూ.632 కోట్లతో సోమశిల-రాళ్లపాడు డబ్లింగ్‌ పనులు చేపట్టబోతున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో ఆరు ప్రాధాన్య ప్రాజెక్టులు. వంశధార ఫేజ్‌-2, వంశధార-నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్‌-1, అవుకు టన్నెల్‌, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పూర్తి చేస్తేందుకు వేగంగా అడుగులు చేస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి పనుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. ‘మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40,000 కోట్లతో రాయలసీమ కరువు నివారణ పథకాన్ని చేడుతున్నాం. రూ.15 వేల కోట్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా మొదటి దశలో రూ.3,500 కోట్లు విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం.

నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేస్తాం కృష్ణా నది దిగువన 2 బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు చింతలపూడి ఎత్తిపోతల పనుల వేగాన్ని పెంచుతున్నాం. . 3రాజధానులతో పాటు.. మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేస్తాం. దేవుడి దయతో, అందరి ఆశీస్సులతో ఇంకా పనులు, కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

ట్రంప్ విఫలం కావడంతో ఆర్మేనియా-అజర్ బైజాన్ కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

అభివృద్ధి పై దృష్టి సారించే 4 ఎంవోయూలు కుదుర్చుకున్న భారత్, మాల్దీవులు

బీహార్ ఎన్నికలు: రఘోపూర్ సీటులో రతన్ యాదవ్ 9000 ఓట్లతో ముందంజలో ఉన్నారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -