ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఆమె బీఫామ్‌ అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

సునీత వెంట బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పోతుల సురేష్‌ ఉన్నారు. కాగా మండలిలో ఖాళీగా ఉన్న ఓ స్థానానికి ఇదివరకే నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన సునీత.. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీరును నిరశిస్తూ రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు.

ఇది కూడా చదవండి:

తెలంగాణలో మొత్తం సోకిన వారి సంఖ్య 2,90,008 కు చేరుకుంది.

కరోనా వ్యాక్సిన్ పై రాజస్థాన్ ఆరోగ్య మంత్రి పెద్ద ప్రకటన చేశారు

తెలంగాణ ప్రభుత్వం ధర్ని పోర్టల్‌లో మరో కొత్త ఎంపికను తీసుకువచ్చింది

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -