తిరుపతి (ఆంధ్రప్రదేశ్) : తిరుపతిలో భర్త నిర్వాకం బయటపడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వ్యభిచారిగా ప్రచారం చేశాడు.
తిరుపతికి చెందిన రేవంత్ కుమార్. అదే ప్రాంతాకి చెందిన యువతిని ఈ ఏడాది అగస్టు 13న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన మూడో రోజు నుంచే ఆమెను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. అక్కడితో అతడి ఆగడాలు ఆగలేదు. ఏకంగా భార్యపై అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆమెను వ్యభిచారిగా చిత్రీకరించాడు.
భర్త పెట్టే వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిన భార్యకు రేవంత్ కుమార్ అక్రమ సంబంధాలు అంటగట్టాడు. పెళ్లైన వారానికే ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు తనను అనుమానిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తన వ్యక్తిగత ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసినట్లు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఐదు నెలలుగా భర్త ఆగడాలను భరించిన ఆమె దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ లో కూడా తాను చెప్పిన అంశాలు కాకుండా రేవంత్ వెర్షన్ ను నమోదు చేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది.తన భర్త వేధింపులను అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదని బాధితురాలు చెప్పింది. భర్త చేసిన చిత్రహింసలతో ఒంటిపై గాయాలయ్యాయని ఆమె చెప్తోంది.
తమ కూతరు ఇష్టపడిందని పెళ్లి చేస్తే.. ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని బాధితురాలి తల్లిదండ్రులు చెప్తున్నారు. రేవంత్ బంధువుల్లో పోలీసులుండటంతో లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగక్కపోవడంతో బాధితురాలు తన బంధువులతో కలిసి రేవంత్ ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఐతే భార్య వస్తున్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన రేవంత్ ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు మాత్రం లాయర్ దగ్గరకు వెళ్లినట్లు చెప్తున్నారు.
మరోవైపు రేవంత్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి రేవంత్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు మాత్రం రేవంత్ పై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షిస్తామన్నారు.
రాష్ట్రంలో విస్టాడోమ్ కోచ్ రైలు కార్యకలాపాలను రైల్వే తిరిగి ప్రారంభించింది
సార్స్-కొవ్-2 యొక్క రెండు కొత్త మార్పుచెందగలవారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కనుగొనబడ్డారు