దక్షిణాదిన అతిపెద్ద ప్లాస్టిక్‌ రీసైక్లింగ్ రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ ప్లాంట్ ప్రారంభం

పర్యావరణ నిర్వహణ సేవల సంస్థ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద ఉన్న జేఎన్‌ ఫార్మాసిటీలో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌ రాజ్, రామ్‌కీ ఫార్మా సిటీ ఎండీ పి.పి.లాల్‌ కృష్ణ చేతుల మీదుగా బుధవారం ఈ ఫెసిలిటీ ప్రారంభోత్సవం జరిగింది.

దక్షిణాదిన అతిపెద్ద ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్లలో ఇది ఒకటని రామ్‌కీ రిక్ల్లమేషన్, రీసైక్లింగ్‌ సీఈవో సతీష్‌ చీటి ఈ సందర్భంగా తెలిపారు. పరిశ్రమలతోపాటు గృహాల నుంచి వచ్చే ప్లాస్టిక్‌ వ్యర్థాలను అత్యంత నాణ్యమైన రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ గ్రాన్యూల్స్‌గా మారుస్తారు. ఈ గ్రాన్యూల్స్‌ను ప్లాస్టిక్‌ వస్తువులు, ప్యాకేజింగ్‌ తయారీకి ఉపయోగిస్తారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రం గంటకు ఒక మెట్రిక్‌ టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేయగలదు. విభిన్న అవసరాలకు వినియోగించే విధంగా 51 మైక్రాన్‌ కంటే మందంగా ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ తయారు చేసే యంత్రాలను సైతం ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు.

ఇది కూడా చదవండి:

జెరెమీ రెన్నర్ 49 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు

రీనా రాయ్ షత్రుఘన్ యొక్క వెర్రి ప్రేమికుడు, కానీ వివాహం చేసుకోలేకపోయాడు

పుట్టినరోజు స్పెషల్: అందంగా కనిపించడానికి కోయెనా మిత్రాకు ముక్కు శస్త్రచికిత్స చేయించుకున్నారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -