స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర కన్సార్షియం బ్యాంకులకు సుమారు రూ.1800.72 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన ప్రైవేట్ రుణగ్రహీత కంపెనీపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డిసెంబర్ 4న తెలిపింది.
లజపత్ నగర్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ, దాని డైరెక్టర్, పూచీదారుడు మొదలైన వారితో సహా ఇతర వ్యక్తులపై, గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు, గుర్తు తెలియని ప్రైవేట్ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సిబిఐ తెలిపింది.