మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

తెలంగాణ: మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి  ఆత్మహత్యకు చేసుకుంది. ఏ కష్టం వచ్చిందో తెలియదు గానీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

కోమలత(29) అనే మహిళ జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం గొర్రె గుండం గ్రామంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. అయితే అర్ధరాత్రి సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన కోమలత.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న మల్యాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే కోమలత ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గత కొంతకాలంగా కోమలత కుటుంబంలో కలహాలు చోటుచేసుకుంటున్నట్టుగా ఆమె బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోమలత మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

తెలంగాణ: టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి దాడి కేసులో 53 మంది బిజెపి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు

తెలంగాణ గవర్నర్, వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకు శాస్త్రవేత్తలను ప్రశంసించారు

తెలంగాణ, ఇంటర్ పరీక్ష ఫీజుకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయబడింది,

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -