సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు

Nov 11 2020 01:39 PM

అమరావతి: నంద్యాల్‌లో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఒక వ్యక్తి తన భార్య, బిడ్డలతో కలిసి ఉసురు తీసుకొన్నాడు అంటే ఎంతటి ఒత్తిడిని, మానసిక వేదనను అనుభవించి ఉంటాడో అందరం అర్థం చేసుకోవాలన్నారు. ఒక కేసు విచారణలో సలాం, అతని భార్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిచిన నేపథ్యంలో ఈ ఆత్మహత్య చోటు చేసుకుందని తెలిపారు.

సలాం కుటుంబమంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిందెవరు? అందుకు కారణమైనవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గితే ఇలాంటి పరిస్థితులే వస్తాయని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతల చేతుల్లో ఆయుధాలుగా మారితే క్షేత్ర స్థాయి పోలీసులే ఇరుకునపడతారని హెచ్చరించారు. వారి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఈనెల 3న రైలు కింద పడి అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక పోలీసు బృందం (సిట్‌) విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 

పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు

పోలీసుల వేధింపులతో విసిగిపోయిన కుటుంబం కదులుతున్న రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

Related News