సామాజిక బాధ్యతగా కార్పొరేట్‌ కంపెనీలు వాహనాల వితరణ

అమరావతి: ప్రభుత్వాస్పత్రులకు మందులు సరఫరా చేసే రవాణా వ్యవస్థను ఇక ప్రభుత్వమే చేపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) కొనుగోలు చేసి, జిల్లా కేంద్రాల్లో ఉన్న సీడీఎస్‌ (సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌)లకు చేరుస్తుంది. అక్కడి నుంచి బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరవేయాలి. ఇప్పటిదాకా ప్రైవేటు వాహనాల ద్వారానే రవాణా చేసేవారు. ఇకపై కొద్ది రోజుల్లో ఈ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వమే సొంత వాహనాలతో ప్రతి ఆస్పత్రికి మందులను చేర వేయనుంది.   

కొన్ని ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మందుల సరఫరాకు వాహనాలు ఇచ్చాయి. ఈ వాహనాలతోనే మందులు సరఫరా చేయనున్నారు. జిల్లాకు అవసరాన్ని బట్టి రెండు నుంచి నాలుగు వాహనాలు మందుల సరఫరాకే పని చేస్తాయి. సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నెలకు రూ.10 లక్షల లెక్కన ఏడాదికి రూ.1.20 కోట్లు ఆదా అవుతాయి. అంతేకాకుండా మందులను సకాలంలో చేర్చేందుకు అవకాశం ఉంది. గతంలో ప్రై వేటు రవాణా వ్యవస్థ ఉండటం వల్ల సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ల నుంచి జిల్లా, తాలూకా, మండల స్థాయి ఆస్పత్రులకు మందులు చేర వేయడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ముందే రూట్‌ మ్యాప్‌ వేసుకుని ఏ జిల్లాలో వాహనాలు ఆ జిల్లాలో అవసరం మేరకు పని చేస్తాయి. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి ప్రతి రోజూ కొన్ని ఆస్పత్రులకు ముందే రూట్‌ మ్యాప్‌ నిర్ణయిస్తారు. దీని ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు ఇండెంట్‌ మేరకు మందులు సకాలంలో వెళతాయి.

ఇన్నాళ్లూ ప్రైవేటు సంస్థ మందులు సరఫరా చేసేది. ఇప్పుడు ప్రభుత్వ పరిధిలోనే చేస్తున్నాం. దీంతో మందుల రవాణా వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు సకాలంలో పేద రోగులకు మందులు అందించే అవకాశం ఉంటుంది. గతంలో కంటే తక్కువ వ్యయంతోనూ ఈ రవాణా జరుగుతుంది. 

ఇది కూడా చదవండి:

ఇంటి పత్రంతోపాటు పాసు పుస్తకం జారీ,మొదలైన మార్కింగ్‌ పనులు

ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని దూషించారు: "మీరు లడఖ్‌లో గోర్లు ఫిక్స్ చేసి ఉంటే, చైనీయులు భారతదేశంలోకి ప్రవేశించేవారు కాదు"అన్నారు

శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్‌ సామర్థ్య పరీక్షలు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -