ఇంటి పత్రంతోపాటు పాసు పుస్తకం జారీ,మొదలైన మార్కింగ్‌ పనులు

అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు పట్టాలు పొందిన లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి ఇళ్లు మంజూరు పత్రంతో పాటు ప్రత్యేకంగా పాసు పుస్తకం అందజేస్తున్నారు. లబ్ధిదారుడి పేరు, మంజూరైన స్కీమ్, ఇంటి విలువ, హౌసింగ్‌ ఐడీ నంబర్, లే అవుట్‌ పేరు, కేటాయించిన ప్లాటు నంబర్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను పాసు పుస్తకంలో పొందుపరిచారు. ఇంటి నిర్మాణానికి మార్కింగ్‌ అనంతరం బేస్‌మెంట్, రూఫ్‌ లెవల్, స్లాబ్‌ లెవల్, ఫినిషింగ్‌ స్థాయిల్లో ఎంత మేరకు స్టీలు, సిమెంట్‌ వాడారనే వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1902కి ఫోన్‌ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఆయా జిల్లాలకు చెందిన గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. 

సొంతంగా ఇళ్ల పట్టాలు, పొసెషన్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండి సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చే లబ్ధిదారులకు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు మార్కింగ్‌ ఇస్తున్నారు. నియోజకవర్గాల మార్కింగ్‌ వివరాలను ఏఈలు సేకరించి రోజూ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయాలి. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన పరికరాల కొనుగోలు టెండర్లను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి లేఅవుట్‌ వద్ద పరికరాలు, ధరల వివరాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇళ్ల నిర్మాణాల కోసం పరికరాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో టెండర్లను ఆహ్వానించాం. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి చేయాలని ఆదేశించాం. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తాం. 

ఇది కూడా చదవండి:

ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని దూషించారు: "మీరు లడఖ్‌లో గోర్లు ఫిక్స్ చేసి ఉంటే, చైనీయులు భారతదేశంలోకి ప్రవేశించేవారు కాదు"అన్నారు

కొత్త వాహనాల కొనుగోలుపై లాభాల పై నితిన్ గడ్కరీ ముఖ్యాంశాలు పాత వాహనాల రద్దుపై కొత్త వాహనాల కొనుగోలు పై నితిన్ గడ్కరీ

సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా మయన్మార్ లో మళ్లీ వేలాదిమంది ర్యాలీ

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -