మూడు రాజధానులకు మద్దతుగా కొనసాగుతున్న రిలే దీక్షలు

వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న చంద్రబాబు రెండేళ్లుగా పాలక పక్షాన్ని ముందుకెళ్లనీయకుండా, చివరకు సంక్షేమాన్ని సైతం అడ్డుకోవడాన్ని చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని బహుజన పరిరక్షణ సమితి, దళిత నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 120వ రోజు రిలే నిరాహార దీక్షలకు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు

రాష్ట్రం యావత్తూ అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా నిలుస్తుంటే.. చంద్రబాబు తన బినామీలను పెట్టి అమరావతి ఉద్యమం పేరిట చేయిస్తున్న దొంగ దీక్షలను ఎల్లో మీడియాలో పెద్దదిగా చూపడం విడ్డూరమన్నారు. సీపీఐ నాయకులు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, రుద్రపోగు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇది కూడా చదవండి:

సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆలయ-మసీదు నిర్మాణం గురించి మంత్రులు ప్రతినిధులతో చర్చించారు

డబ్బు అవసరమంటూ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో పోస్టింగ్‌లు

కరీంనగర్ మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో బిజెపి-టిఆర్ఎస్ నాయకులు గొడవ పడ్డారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -