గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌: ‘ఆరు దశాబ్దాల వలస పాలనతో కుదేలైన తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో చేపట్టింది. సమతుల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షే మం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లోనూ ఎంతో పురోగతి సాధించి, యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఆకలి దప్పులు, ఆత్మహత్యలు లేని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో కూడిన బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయి. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రగతి యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తుంది’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు.

కొత్త పథకాలు, కొత్త చొరవ, కొత్త ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకం’అని అన్నారు. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన 72వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే. 

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు పెంచింది. తక్కువ వేతనాలతో పనిచేసే ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు, పారిశుధ్య కార్మికులు, 108 సిబ్బంది తదితరుల వేతనాలు పెంచింది. తాజాగా ప్రతి ఉద్యోగికీ, ప్రతి పెన్షనర్‌కు మరోసారి వేతనాలు పెంచాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితినీ పెంచాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పదోన్నతులు పూర్తయిన వెంటనే అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తిని, ప్రభావాన్ని, ప్రాణనష్టాన్ని గణనీయంగా అరికట్టగలిగింది. కోవిడ్‌ మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.4 శాతం అయితే తెలంగాణలో 0.54 శాతం మాత్రమే. కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్లు అయిన వైద్య ఆరోగ్య సిబ్బంది, రేయింబవళ్లు సేవలందించిన పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద కార్యకర్తలను మనన్ఫూర్తిగా అభినందిస్తున్నా. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గడంతో బడ్జెట్‌ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆదాయం తగ్గినప్పటికీ పేదల సంక్షేమానికి చేసే ఖర్చులో ప్రభుత్వం ఒక్క పైసా కూడా కోత విధించలేదు. 

‘ఆరు దశాబ్దాల వలస పాలనతో కుదేలైన తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో చేపట్టింది. సమతుల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షే మం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లోనూ ఎంతో పురోగతి సాధించి, యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఆకలి దప్పులు, ఆత్మహత్యలు లేని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో కూడిన బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయి. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రగతి యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తుంది’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు.

కొత్త పథకాలు, కొత్త చొరవ, కొత్త ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకం’అని అన్నారు. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన 72వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు పెంచింది. తక్కువ వేతనాలతో పనిచేసే ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు, పారిశుధ్య కార్మికులు, 108 సిబ్బంది తదితరుల వేతనాలు పెంచింది. తాజాగా ప్రతి ఉద్యోగికీ, ప్రతి పెన్షనర్‌కు మరోసారి వేతనాలు పెంచాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితినీ పెంచాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పదోన్నతులు పూర్తయిన వెంటనే అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తిని, ప్రభావాన్ని, ప్రాణనష్టాన్ని గణనీయంగా అరికట్టగలిగింది. కోవిడ్‌ మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.4 శాతం అయితే తెలంగాణలో 0.54 శాతం మాత్రమే. కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్లు అయిన వైద్య ఆరోగ్య సిబ్బంది, రేయింబవళ్లు సేవలందించిన పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద కార్యకర్తలను మనన్ఫూర్తిగా అభినందిస్తున్నా. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గడంతో బడ్జెట్‌ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆదాయం తగ్గినప్పటికీ పేదల సంక్షేమానికి చేసే ఖర్చులో ప్రభుత్వం ఒక్క పైసా కూడా కోత విధించలేదు. 

 ఇది కూడా చదవండి:

ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియాకు సిఎం అశోక్ గెహ్లాట్ హితవు

గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనావైరస్ యొక్క స్కూజ్, యూ ఎస్ ఇప్పటికీ ఇప్పటికీ మొదటి లోనే ఉంది

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -