వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు

అమరావతి: రాష్ట్రంలో రౌడీ ప్రభుత్వం రాజ్యమేలుతోంది , మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే సీఎం జగన్ స్పందించలేదని,  విచారణ పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వ కుట్రలు చేస్తున్నారని  టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. డీఎస్పీ, ఎస్పీలను కూడా విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని హితవుపలికారు. డీజీపీ సవాంగ్‌ పోలీస్‌ వ్యవస్థను సరిగా నడపలేకపోతున్నారని వర్లరామయ్య విమర్శించారు. 

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం (45), భార్య నూర్జహాన్‌ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలందర్‌ (10)తో కలిసి పాణ్యం మండలం కౌలూరు వద్ద గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బంగారు షాపులో చోరీ, ఆటోలో దొంగతనం వంటి కేసుల్లో పోలీసులు అబ్దుల్‌ సలాంను వేధించినట్లు అప్పట్లోనే ఆయన బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలోనే.. ఆత్మహత్యకు ముందు అబ్దుల్‌ సలాం కన్నీటి పర్యంతమవుతూ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చింది. 

హైకోర్టు ఉత్తర్వుల తరువాత మాజీ మంత్రి, ఎంపీ వైయస్ వివేకానంద రెడ్డి హత్యపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది

జగన్మోహన్ రెడ్డి ప్రజల దుస్థితి గురించి తెలుసుకొని రూ .122 కోట్లు కేటాయించారు.

'జగనన్న చెడోడు' పథకం కింద ప్రభుత్వం రూ .51.39 కోట్లు విడుదల చేసింది

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -