కేంద్ర హోం కార్యదర్శి సౌరవ్ రే నేతృత్వంలోని బృందం మంగళవారం గోదావరి జిల్లాలను సందర్శించింది.

కాకినాడ, ‌ ఏలూరు: ’ ఉభయగోదావరి జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌ రే నేతృత్వలోని బృందం సభ్యులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆరుగాలం శ్రమ చేతికి అందకుండా పోతోందనీ, నాణ్యత దెబ్బతిని మద్దతు దక్కడం లేదని వాపోయారు. ఏలేరు జలాశయానికి వచ్చిన వరదతో పది ఎకరాల్లో వేసిన వరి పంట మునిగి ఎందుకూ పనికి రాకుండా పోయిందని ఉప్పాడ కొత్తపల్లి మండలం రమణక్కపేట రైతు సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. 1.2 ఎకరాలు కౌలుకు తీసుకుని 1.5 లక్షలు ఖర్చు పెట్టి అరటి వేస్తే భారీ వర్షాలతో తోటల్లో నీరు చేరి చెట్లన్నీ కుళ్లిపోయాయని రావులపాలెం మండలం కొమరాజులంక కౌలు రైతు గుర్రాల లంకయ్య పేర్కొన్నారు. 

బృంద సభ్యులు తూ.గో లో రావులపాలెం, ఆలమూరు, మండపేట, రామచంద్రపురం మండలాల మీదుగా కాకినాడకు చేరుకున్నారు. యు.కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో పంట నష్టాలు పరిశీలించి, రైతుల ఆవేదనను విన్నారు.రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. అన్ని విషయాలను నివేదికలో పొందుపరుస్తామని వెల్లడించారు.

 అకాల వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయామని పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు రైతులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సరైన ధర, రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడితే.. మంచి ధర వచ్చే నాటికి వరదలు ఉద్యాన పంటలను ఛిన్నాభిన్నం చేశాయన్నారు. కేంద్ర బృందం సభ్యులు తాడేపల్లిగూడెం పరిధిలోని నందమూరు, నిడదవోలు మండలం కంసాలిపాలెంలో ఎర్రకాలువ వరద ముంపునకు గురైన వరి, ఉద్యాన తదితర పంటలను పరిశీలించారు. 

పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు

పోలీసుల వేధింపులతో విసిగిపోయిన కుటుంబం కదులుతున్న రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -