రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాలు ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు ఎందుకు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు.. అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని ప్రధాని మోదీనే ప్రకటించారని, ఏపీలో కూడా సీఎస్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి బొత్స చెప్పారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ తెలియచేసిన గంట వ్యవధిలోనే షెడ్యూల్ విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు.
2018లో పెట్టాల్సిన ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?. ఏపీలో 30 కేసులు కూడా లేనప్పుడు ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారు. కరోనా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. ప్రభుత్వాన్ని కాదని ఎన్నికలు జరుపుతామనడం నేనెప్పుడూ చూడలేదు. ఎవరి స్వార్థం కోసం ఎస్‌ఈసీ పనిచేస్తోందో అర్థం కావడం లేదు. కొద్దిరోజులు ఎన్నికలు వాయిదా వేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి?. ఎస్‌ఈసీ ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాధాన్యతను ఎస్‌ఈసీ పట్టించుకోవడం లేదు. మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.. ఎన్నికలంటే భయపడటం లేదు.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని’’ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు
ఇది కూడా చదవండి:
ఎస్‌బీఐ కన్సార్టియం నుంచి రూ.4,736.57 కోట్లు కొల్లగొట్టిన కేసు
రాష్ట్రవ్యాప్తంగా 17వ రోజూ కొనసాగిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ
ఆర్సీహెచ్ పోర్టల్‌కు వివరాల అనుసంధానంలో మొదటి స్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్