బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి :గుమ్మనూరు జయరాం

రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకు డిప్యూటీ సీఎం అవకాశం కల్పించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కార్పొరేషన్లు, చైర్మన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు కల్పించి మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించారుమహిళల అభివృద్ధికి ఆసరా, చేయూత పథకాలను అమలు చేసి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. 

పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందజేశారు. జిల్లాలో బీసీ వాల్మీకికి మంత్రి పదవి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా సీఎం జగన్ ఏర్పాటు చేశారు. బీసీలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం' అని మంత్రి జయరాం పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి:

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

భారతదేశంలో తగ్గిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 45674 కొత్త కేసులు కనుగొనబడ్డాయి

ప్రీ వెడ్డింగ్ ఆతురత నుంచి బయటపడటానికి 4 సులభ చిట్కాలు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -